Sunday 28 May 2017

కొవ్వును కరిగించే skyushee యోగ - KOVVU KARIGINCHE SKYUSHEE

కొవ్వు కరిగించే సుషీ
ఆడుకునే బంతులయితే గట్టిగా ఉంటాయి. కానీ స్క్యుషీబాల్
అలా కాదు. దాని సాయంతో వ్యాయామాలు చేస్తే
ఒత్తిడి అదుపులో ఉండటమే కాదు..
పిరుదుల
దగ్గర పేరుకున్న కొవ్వును సులువుగా తగ్గిం
చుకోవచ్చు. ఈ వ్యాయామాల వల్ల కాళ్లూ బలోపేతం
అవుతాయి. ఆ తీరైన ఆకృతిలోకీ మారతాయి.
హీల్ డిగ్ స్క్వాట్: కుడి కాలుని కొద్దిగా
వంచి ఎడమ కాలుని బంతి మీద పెట్టి నిటా
రుగా నిల్చోవాలి. అప్పుడు చేతులు చాతికి
ఎదురుగా ఉండాలి. ఇలా
చేస్తున్నప్పుడు బంతి కాలికి
కొద్ది దూరంలో ఉంటుంది.
ఇప్పుడు కాలితో బంతిని
దగ్గరకు లాక్కుని రెండోకా
లిని నిటారుగా ఉంచాలి.
రెండు చేతులూ పైకి పెట్టాలి.
బంతిని వెనక్కీ ముందుకీ లాగడాన్ని గైడ్ చేయడం
అంటారు. అలా ఇరవైసార్లు చేయాలి.

బట్ లిఫ్ట్: ఎడమ కాలుని కొద్దిగా వెనక్కి వంచి మోకాలి దగ్గర బంతిని ఉంచి
చేతుల్ని ఛాతికి సమాంతరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుకు వంగే
ప్రయత్నం చేయాలి. ఇలా ఇరవైసార్లు చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని
చేస్తున్నప్పుడు ముందుకు పడిపోయే ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి... ఒక కుర్చీని
ఎదురుగా పెట్టుకోవాలి. ముందుకు తూలిపడే
ప్రమాదం ఉందనుకుంటే అప్పుడు దాన్ని
పట్టుకోవచ్చు.
నీ స్వింగ్: చేతులు రెండూ పైకి
పెట్టి రెండు కాళ్లూ నిటారుగా
చాపి ఎడమ కాలి తొడకీ, మోకా
లికీ మధ్యలో బంతిని పట్టి
ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా ఆ
భంగిమని అలానే ఉంచి
చిత్రంలో చూపించినట్టుగా
వెనక్కి తీసుకెళ్లాలి. బ్యాలెన్స్
కోసం చేతులు ముందుకు
వస్తాయి. ఇలా ఇరవైసార్లు
చేయాలి.







No comments:

Post a Comment