Monday 29 May 2017

గోట్ యోగ అమెరికా - యూ కె / GOAT YOGA - AMERICA&UK

నయా హవా
గో..టు..గోటయోగా!
అమెరికా, యూకేలో గోట్ యోగా పాపులర్. ఇది కిడ్డింగ్ అనుకోకండి.
నిజమే మరి! అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో ఉండే క్రిస్ అనే రైతుకి
ఈ ఆలోచన వచ్చింది. అదెలాగం్చటే ఆయన బయట పడుకున్నపుడు ఓ
చిన్న మేకపిల్ల తన వీపుమీద నిలుచుందట. అతనికి హాయిగా అనిపించిం
దట. ఇది చూసిన తన భార్య తమాషాగా 'గోట్ యోగా' బావుందా అని
తమాషాగా అడిగిందట. ఆ తర్వాత ఆయన 'గోట్ యోగా' చేసేవాడు.
దీనిని పక్కనున్న పల్లెల్లోని రైతులు ఫాలో అయ్యారు. అమెరికా నుంచి
యూకేకి గోట్ యోగా పాకింది. యోగా మ్యాట్ పరుచుకుని... వెల్లకిలా
నాలుగుకాళ్ల జంతువుల్లాగా ఆసనం వేసి, వారిపైన మేకను నిల్చోబెడ
తారు. ఇదే గో యోగా. ఇలా చేస్తే రక్తప్రసరణతో పాటు మనసు ప్రశాం
తంగా ఉంటోందట. దీంతో మగవారితో పాటు మహిళలూ, పిల్లలూ ఈ
గోట్ యోగా అంటే తెగ ఇష్టపడుతున్నారు. యూరప్ లోని యోగా టీచర్
మెక్ మాత్రం గోట్ యోగా పచ్చని చేలల్లో చేయిస్తున్నాడు. రెండుగంట
లకు 25 యూరోలు వసూలు చేస్తున్నాడు. గోట్ యోగా సోషల్ వెబ్ సై
| పాపులర్ కావటంతో యూరప్లో చాలామందికి తెలిసింది. దీంతో
గోట్ యోగా చేయాలంటే సెప్టెంబర్ వరకూ ఖాళీలేవని యోగా టీచర్
మెక్ సంబరపడుతున్నాడు. మొత్తానికి అమెరికన్లు, యుకెవాసులు గోటు
గోట్ యోగా అంటున్నారు.


No comments:

Post a Comment