Wednesday, 18 November 2020

అధిక కొవ్వు కరగాలంటే / ADHIKA KOVVU KARAGADANIKI ASANALU.

 




పొట్టా, నడుము భాగాల్లో పేరుకుపోయిన

అధిక కొవ్వును కరిగించాలన్నా... గర్భాశయ,

మూత్రాశయ సమస్యల నుంచి ఉపశమనం

పొందాలన్నా... ఈ ఆసనాలను ప్రయత్నించండి.

అధిక కొవ్వు

కరగాలంటే...

మాలాసనం: రెండుకాళ్లను దూరంగా

పెట్టి నేల మీద కూర్చోవాలి. అయితే

శరీరాన్ని నేల మీద ఆనించకూడదు. మోచే

తులతో మోకాళ్లను నెడుతూ

నమస్కార ముద్రలో

ఉండాలి. శ్వాస తీసుకుని

వదులుతుండాలి. ఈ

ఆసనంలో 30-60

సెకన్లపాటు కూర్చో

వాలి. ఇలా

ఆరుసార్లు

చేయాలి.

దీనివల్ల కటి

కండరాలూ

బలోపేతమవు

తాయి.

చక్రాసనం: వెల్లకిలా పడుకుని మోకాళ్లను

మడిచి రెండు కాళ్ల మడమలను పిరుదులకు

ఎదురుగా ఉంచాలి. రెండు చేతులను చెవి

పక్కన, చేతివేళ్లు భుజం వైపు వచ్చేలా

పెట్టాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతుల

మీద బరువు వేసి నడుముని పైకి లేపాలి.

శరీరాన్ని ఏమాత్రం కదలించకుండా నడుముని

మాత్రమే పైకి లేపాలి. ఈ ఆసనం వల్ల కింది

పొట్ట నుంచి పైపొట్ట వరకు పూర్తిగా సాగు

తుంది. చేతులు, భుజాలు, పిరుదులు, నడుము

దగ్గరున్న అధిక కొవ్వు త్వరగా కరుగుతుంది.



Monday, 16 November 2020

నెలసరి సమస్యలకు యోగా లో పరిష్కారం

 కొంతమంది మహిళలు నెలసరి సంబంధిత సమస్యలతో చాలా బాధపడుతుంటారు. నెలసరి ఆలస్యం కావడం రుతుక్రమాన్ని కి ముందు కోపంగా చిరాగ్గా దిగులుగా ఉండటం వంటివన్నీ ఇందులో ఉంటాయి .ఈ సమస్యలన్నింటికీ యోగాలో చక్కటి పరిష్కారం ఉంది అదే రుతు ధర్మ ముద్ర. ఈ ముద్ర తో నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు తద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.





రుతుధర్మ ముద్ర - ఫొటోలో చూపిన విధంగా రెండు చేతుల బొటన వేళ్ళ చివరలను కలపాలి కుడిచేయి మధ్య వేలు చిటికెన వేలు పైకి వచ్చేలా ఎడమచేతి చూపుడు మధ్య వెళ్ళను కిందకు పెట్టాలి. ముద్ర లో కనీసం 10 నిమిషాల పాటు ఉండాలి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస తీసుకున్నప్పుడు అండాశయానికి, గర్భాశయానికి వెళుతున్నట్టు.. శ్వాస వదిలినప్పుడు అక్కడున్న ఇబ్బందులన్నీ దాంతో పాటుగా బయటకు వెళ్తున్నట్టు ఊహించుకోవాలి. నెలసరి ముందు వచ్చే కోపం, కుంగుబాటు, విసుగు లాంటి ఇబ్బందులన్నీ దీంతో దూరమవుతాయి. రుతుక్రమ ఇబ్బందులను తొలగించే అద్భుతమైన యోగ ముద్ర గా దీనిని అభివర్ణించవచ్చు.